మాజీ మంత్రి రాజేంద్ర సింగ్​కు అసెంబ్లీలో చేదు అనుభవం !

Telugu Lo Computer
0


రాజస్థాన్​ కాంగ్రెస్​ సర్కార్​ బహిష్కరించిన మంత్రి రాజేంద్ర సింగ్​కు ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనను శాసనసభలోకి వెళ్లనివ్వకుండా కాంగ్రెస్​ నేతలు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు చెబుతూ ఆయన బోరుమన్నారు. సీఎం అశోక్​ గహ్లోత్​ అవినీతి చిట్టా తన వద్ద ఉందని, బండారాన్ని బయటపెడతానని రాజేంద్ర సింగ్​ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజస్థాన్​ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష బీజేపీలు పరస్పరం దూషణలకు దిగారు. దీంతో సీఎం అతన్ని బర్తరఫ్​ చేశారు. అయితే జులై 24న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి రాజేంద్ర సింగ్​ రాగా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఆయన్ని అడ్డుకున్నారు. ఇదే విషయంపై రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. 50 మంది నేతలు తనపై దాడి చేసినట్లు చెప్పారు. శాసనసభ నుంచి తనను బయటకు గెంటేసినట్లు విలపించారు. తన వద్ద అవినీతి తాలుకూ వివరాలున్న రెడ్​ కలర్​ డైరీ గురించి అసెంబ్లీ ఛైర్మన్​ మాట్లాడకుండా చేశారన్నారు. రాష్ట్రంలో రూ.100 నుంచి 500 కోట్ల అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. గహ్లోత్​ సన్నిహితుడు ధర్మేంద్ర సింగ్​ రాథోడ్ ఇంట్లో ఐడీ సోదాలు జరిగినప్పుడే తనకు రెడ్​ డైరీ దొరికినట్టు చెప్పారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)