జలదిగ్బంధంలో ఢిల్లీ !

Telugu Lo Computer
0


ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్‌కం టాక్స్ ఆఫీస్ సమీపంలో ఇంకా అనేక కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి. శనివారం ఉదయానినకి నదిలో నీటిమట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ఇప్పికీ ప్రమాదస్థాయి కంటే రెండు మీటర్ల ఎగువనే ఉన్నప్పటికీ నీటి ప్రవాహం తగ్గుముఖం కాస్త ఊరటనిస్తోంది. అయితే శనివారం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న మూడు నాలుగు రోజులు ఢిల్లీ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. వరద ప్రవాహం ధాటికి దెబ్బతిన్న ఇంద్రప్రస్థ వాటర్ రెగ్యులేటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఈ రెగ్యులేటర్ దెబ్బతినడం వల్లనే నది లోని వరద ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇసుక బస్తాలు,కంకరతో వరద ప్రవాహాన్ని ఆపేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, సైనిక జవాన్లు, ఢిల్లీ అధికారులు శ్రమిస్తున్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఢిల్లీలో యమునానది పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాతో దీని గురించి మాట్లాడారు. రానున్న 24 గంటల్లో పరిస్థితి మెరుగుపడుతుందని షా ప్రధానికి వివరించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)