స్నేహితులతో సరదాగా గడిపేందుకు విమానాన్ని అద్దెకు తీసుకున్న యూట్యూబర్ !

Telugu Lo Computer
0


16ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఏకంగా ఓ విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ది సన్ ప్రకారం.. యువకుడి పేరు డోనాల్డ్. వృత్తిరీత్యా యూట్యూబర్. డోనాల్డ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో డిజిటల్ క్రియేటర్ అని వ్రాసుకున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో డోనాల్డ్ యాక్టివ్ గా ఉంటాడు. ఇన్ స్టాగ్రామ్‌లో అతనికి 2.5లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం లగ్జరీ లైఫ్ స్టైల్ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో డోనాల్డ్ షేర్ చేస్తుంటాడు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డోనాల్డ్ ఓ వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో అతను విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఉంది. అందులో డోనాల్డ్‌తోపాటు తన స్నేహితులు ఉన్నారు. అయితే, తాను, తన స్నేహితులు సరదాగా గడిపేందుకు వాణిజ్య విమానాన్ని డోనాల్డ్ అద్దెకు తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటున్న డోనాల్డ్ బహామాస్‌కు వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. అయితే, తన ఇస్టాగ్రామ్ ఖాతాలో అమెరికాలో అత్యంత ధనవంతుడుగా డోనాల్డ్ అభివర్ణించుకున్నాడు. నేను బహామాస్ వెళ్లడానికి మొత్తం విమానాన్ని అద్దెకు తీసుకున్నాను. మేము ఎమర్జెన్సీ కిటికీ దగ్గర కూర్చున్నాము. ప్రయాణం చాలా బాగుంది అని డోనాల్డ్ పేర్కొన్నాడు. డోనాల్డ్ వీడియోను చూసిన నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ నెటిజన్ .. మీ వద్ద అంత డబ్బుంటే మీరు విమానం కొనుగోలు చేయొచ్చు కదా? కేవలం ఒక్కరోజు ప్రయాణానికి ఇంత డబ్బు ఖర్చు చేయడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ అబ్బాయికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనిప్రశ్నించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. డోనాల్డ్ వీడియో షూట్ కోసం మాత్రమే విమానం ఎక్కినట్లు తెలుస్తోంది.. అని పేర్కొన్నాడు. అయితే, ఈ ఏడాది ఇప్పటి వరకు డోనాల్డ్ స్విట్టర్లాండ్, కోస్టారికా, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రాంతాలను సందర్శించానని చెప్పాడు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పర్యటనలు కొనసాగిస్తానని తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)