అమరావతిని సామాజిక అమరావతిగా ఈరోజు పునాది రాయి వేస్తున్నా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  అమరావతిలో ఆర్ 5 జోన్ లో పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం వెంకటపాలెం బహిరంగసభలో జగన్  ప్రసంగించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు అడ్డుపడ్డారన్న జగన్, పేదలకు ఇళ్లు రాకుండా వారు దుర్మార్గంగా వ్యవహరించారు. అంతేకాదు ఇళ్ల పంపిణీపై ఏకంగా హైకోర్టుకు వెళ్లారని, ఈ కార్యక్రమాన్ని ఆపడం కోసం వాళ్లు ఎక్కని గడప దిగని గడప లేదని అన్నారు. చంద్రబాబు అండ్ కో ఇళ్ల పంపిణీ జరగకూడదని 18 కేసులు వేశారని కానీ మూడేళ్లుగా పేదలకు ఇళ్లు పంపిణీ కోసం మీకోసం ప్రభుత్వం పోరాడిందన్నారు. పేదల విజయంగా ఈ కార్యక్రమాన్ని చెప్పవచ్చు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికి పెన్షన్లు ఇస్తున్నామని, కానీ పెత్తందారుల ఆలోచన ఎలా ఉందో ఆలోచించాలన్నారు. అమరావతిని సామాజిక అమరావతిగా ఈరోజు పునాది రాయి వేస్తున్నామన్నారు. ఈరోజు నుంచి అమరావతి మనందరి అమరావతి అని జగన్ అన్నారు. అక్కా చెల్లెళ్ల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చామని..పేదలకు అండగా మార్పు మొదలైందన్నారు. పేరుకు ఇది రాజధాని కానీ ఇక్కడ పేదలు ఉండొద్దా అని సీఎం జగన్ ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇస్తే రాజధాని అభివృద్ధి జరగదని వారించారు. ఇప్పుడు ఇచ్చే ఒక్కో ఇంటి స్థలం విలువ అక్షరాల రూ.7 లక్షలు అని తెలిపారు. రాక్షస బుద్ది ఉన్నవారితో మనం యుద్ధం చేస్తున్నామని, ఇళ్ల పంపిణీని ఆపడం కోసం చంద్రబాబు అనేక కేసులు వేశారన్నారు. పేదలకు వ్యతిరేకంగా ఎన్నో కేసులు వేశారని..కానీ ఏ ప్రభుత్వం చేయని మంచి పనులు ఈ నాలుగేళ్లలో తాము చేశామని జగన్ అన్నారు. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)