పీఎస్ఎల్వీసీ-56 ప్రయోగం సక్సెస్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 30 July 2023

పీఎస్ఎల్వీసీ-56 ప్రయోగం సక్సెస్ !


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని స్పేస్‌పోర్ట్‌ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి డీఎస్‌ఎల్‌వీ-ఎస్ ఏఆర్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ56 విజయంతంగా ప్రయోగించింది. డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహం బరువు 360 కిలోలు. సింగపూర్‌కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డీఎస్టీఏ), ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం పగలు-రాత్రి కవరేజీని అందివ్వనుంది. ఇది పూర్తి పోలారిమెట్రీ వద్ద 1 మీ-రిజల్యూషన్ వద్ద ఇమేజింగ్ చేయగలదు. సింగపూర్‌ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు సేవలందించనుంది. చంద్రయాన్ .3 రాకెట్ ప్రయోగం విజయవంతం తర్వాత పదిహేను రోజులకే ఇస్రో శాస్త్రవేత్తలు సింగపూర్ దేశానికి చెందిన 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ తోపాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇటీవల ఇస్రో వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్ఏఆర్ ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఓఆర్బీ-12 స్ప్రైడర్ శాటిలైట్లను కూడా నింగిలోకి పంపినట్లు అధికారులు వెల్లడించారు. కమర్షియల్ పీఎస్‌ఎల్వీ మిషన్‌లో భాగంగా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్ తరఫున ఈ ఏడు ఉపగ్రహాలను ప్రయోగించినట్లు ఇస్రో వెల్లడించింది.  https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment