టమాటా కిలో రూ.155

Telugu Lo Computer
0


మాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కిలో టామాటా ధర సెంచరీని దాటింది. ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా కిలో టమాటా రూ. 155కు చేరుకుంది. అన్ని మెట్రో నగరాల్లో కిలో టమాటా రూ.58 నుంచి 148 వరకు అమ్ముడవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని పురూలియా ప్రాంతంలో కిలో టమాటా రూ. 155 ధర పలికింది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. కోల్‌కతాలో అత్యధికంగా టొమాటోలు కిలోకు 148 రూపాయలకు అమ్ముడయ్యాయి. ముంబైలో అత్యల్పంగా కిలోకి రూ.58 ధర ఉంటే.. ఢిల్లీలో కిలోకి రూ.110, చెన్నైలో కిలోకి రూ. 117గా టమాటా ధర ఉంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. సగటున ఆల్ ఇండియా రిటైల్ ధర రూ. 83.29గా ఉంది. ఢిల్లీలో నాణ్యత, స్థానికతను బట్టి కిలో టమాటాలకి రూ. 120-140 మధ్యలో ధర పలుకుతోంది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ఆన్‌లైన్ కిరాణా షాపింగ్ అప్లికేషన్‌లలో టొమాటో ధర కిలో రూ.140కి పైగా ఉంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)