కామన్ సివిల్ కోడ్ డ్రాఫ్ట్ రిపోర్ట్ కాపీని సిద్ధం చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం ?

Telugu Lo Computer
0


త్తరాఖండ్ లో తిరిగి అధికారమిస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని హామీ ఇచ్చి మరీ అక్కడ గెలిచిన బీజేపీ సర్కార్.. ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని సిద్దం చేసిన ప్రభుత్వం, దాన్ని అసెంబ్లీలో ఆమోదించి అమలుచేసేందుకు పావులు కదుపుతోంది. అయితే డ్రాఫ్ట్ కాపీలో పొందుపరిచిన అంశాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఉమ్మడి పౌరస్మతి అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేయాలని అక్కడి పుష్కర్ థామీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ఇవాళ కమిటీ అధ్యయనం పూర్తయిందని, త్వరలో ప్రభుత్వనికి నివేదిక సమర్పిస్తామని ప్రకటించింది. అయితే ఈ రిపోర్టులో ఉన్న పలు అంశాలు వెలుగుచూశాయి. ఉమ్మడి పౌరస్మతి అమల్లో భాగంగా ఉత్తరాఖండ్ లో బాలికల వివాహ వయస్సును ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచారు. అలాగే వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని ముసాయిదా సూచించింది. లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్న జంటలు వారి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయడం తప్పనిసరిగా నిర్ణయించారు. 

అలాగే ముస్లిం వివాహ చట్టంలోని హలాలా మరియు ఇద్దత్ లను తొలగిస్తారు. అలాగే ముస్లిం వివాహాలలో అనుమతిస్తున్న బహుభార్యాత్వాన్ని నిషేధిస్తూ ఈ డ్రాఫ్ట్ లో నిర్ణయించారు. ఈ ముసాయిదా విశ్వాసంతో సంబంధం లేకుండా భార్యాభర్తలిద్దరికీ విడాకులు తీసుకోవడానికి సమానమైన కారణాలు, హక్కులను ఇస్తుంది.అలాగే పిల్లల సంఖ్యను కూడా నిర్ణయించాలని ముసాయిదా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఆమోదిస్తే చట్టంగా మారడం ఖాయం. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)