బీహార్‌లో పుట్టిన వింత శిశువు !

Telugu Lo Computer
0


బీహార్‌లోని సరన్ జిల్లాలో ఛప్రా నగరంలో ఛప్రా నగరంలోని శ్యామ్ చక్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో ప్రసూత ప్రియా దేవి అనే మహిళ ఈ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఈ వింత శిశువును చూసేందుకు ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, రోగులు ఎగబడ్డారు. ఈ వింత శిశువుకు ఒక తల, నాలుగు చెవులు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు, రెండు గుండెలు, రెండు వెన్నెముక ఎముకలు ఉన్నాయి.  ఆసుపత్రి యాజమాన్యం ఆపరేషన్ చేసి బాలికను బయటకు తీశారు. ఆ సమయంలో నవజాత శిశువు సజీవంగా ఉంది. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించింది. ఈ విషయమై ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ చాలా తక్కువ మందిలోనే ఇలా కనిపిస్తుందన్నారు. గర్భాశయంలోని ఒకే గుడ్డు నుండి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఇది జరుగుతుంది. వైద్య పరిభాషలో ఇలాంటి పిల్లలను కంజాయిన్డ్ ట్విన్స్ అంటారని వైద్యులు చెప్పారు . ఈ ప్రక్రియలో ఇద్దరూ సకాలంలో విడిపోతే, కవల పిల్లలు పుడతారు, కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోలేరు, ఆ పరిస్థితిలో అలాంటి పిల్లలు పుడతారు అని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం ఉందని, పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. వారిని త్వరలోనే ఇంటికి పంపిస్తామని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)