'నాకు ప్రాణహాని ఉంది '

Telugu Lo Computer
0


''నాకు ప్రాణహాని ఉంది.. ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారనే సమాచారం ఉంది. జనసేన నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలను పాటించండి'' అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. శనివారం రాత్రి కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. 'వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. వైకాపా పాలకులను గద్దె దింపే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అధికారం పోతుందన్న భావన నాయకులను క్రూరంగా మార్చేస్తుంది. ఎంతకైనా తెగిస్తారు' అని వ్యాఖ్యానించారు. తనను భయపెట్టేకొద్దీ మరింత రాటుదేలుతానని హెచ్చరించారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీరమహిళల మీద చేసిన దాడిని మర్చిపోనన్నారు. ఓ బలమైన కార్యాచరణ లేక అప్పట్లో వెనుకడుగు వేశామని.. సరైన సమాధానం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వైకాపాకు ఒక్కటీ దక్కకూడదని స్పష్టం చేశారు. తాను సినీ నటుడిని కాకపోయి ఉంటే.. బలమైన నాయకుడిగా జనంలోకి చొచ్చుకుని వెళ్లేవాడిననన్నారు. అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటోందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)