స్మగ్లర్ల నుంచి భారీగా బంగారం స్వాధీనం !

Telugu Lo Computer
0


తమిళనాడులో స్మగ్లర్లు రెండు పడవల్లో 11 కిలోల బంగారాన్ని శ్రీలంక నుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా రామనాథపురం జిల్లాలోని మండపం చేపల రేవు వద్ద ఒక్కసారిగా భారత కోస్టుగార్డులు ప్రత్యక్షమయ్యారు. దీంతో స్మగ్లర్లు షాక్ అయ్యారు. ఇక తమ పని అయిపోయిందనుకున్నారు. కానీ బంగారంతో మాత్రం పట్టుబడకూడదనుకున్నారు. అంతే అందరూ ఆలోచించుకుని తమవద్ద ఉన్న 11 కేజీల బంగారాన్ని రామనాథపురం జిల్లాలోని మండపం చేపల రేవువద్ద సముద్రంలో విసిరేశారు. స్మగ్లర్ల పన్నాగం అర్థం అయిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారత కోస్టుగార్డులు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, కస్టమ్స్‌ సిబ్బంది కలిసి బంగారం కోసం రెండు రోజుల పాటు నిర్విరామంగా సముద్రంలో గాలించారు. ఎట్టకేలకు 11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.20.2 కోట్ల నుంచి రూ.32 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేశారు. అలాగే వడలైవద్ద మరో పడవలో 21.2 కిలోల బంగారాన్ని గుర్తించి అధికారులు పట్టుకున్నారు. ఇలా దాదాపు రూ.20 కోట్ల విలువైన 32.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని  డీఆర్‌ఐ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)