వైరలవుతున్న కార్టూన్‌ !

Telugu Lo Computer
0


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన సమయంలో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కొందరు పాత్రికేయులు పెట్టిన పోస్టులను తొలగించాల్సిందిగా మోడీ ప్రభుత్వం తమను కోరిందని, లేకుంటే భారత్‌లో ట్విట్టర్‌ను మూసేస్తామని బెదిరించిందని ట్విటర్‌ మాజీ సిఇఒ జాక్‌ డార్సే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాను భారత ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తానని ట్విట్టర్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. అవన్నీ అసత్యాలేనని బిజెపి నేతలు మండిపడ్డారు. ఈ వార్తల అనంతరం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ రిపోర్టర్‌ను బెదిరిస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీనిపై ఓ కార్టూన్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. ట్విటర్‌ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్‌ సిఇఒ ఎలన్‌మస్క్‌ను బెదిరిస్తున్నట్లు ఈ కార్టూన్‌ను చిత్రీకరించారు. స్మృతి ఇరానీ ట్విటర్‌ రిపోర్టర్‌కు ఫోన్‌ చేసి ''మీ బాస్‌కి కాల్‌ చేయాలా అని బెదిరించినట్లు, ఆ వెంటనే మస్క్‌కి కాల్‌ చేసి  ''ఆ రిపోర్టర్‌కి ఎంత ధైర్యం, కాల్చి పారేయండి'' అని ఆదేశించడం కనిపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)