ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భవానీ దేవికి కాంస్యం

Telugu Lo Computer
0


ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తొలిసారిగా మెడల్ సాధించిన తొలి ఇండియన్ ఫెన్సర్‌గా భవానీ దేవి చరిత్రకెక్కింది.చైనాలో జరిగిన ఈ పోటీలో మహిళల సాబెర్ విభాగంలో ఆమె కాంస్య పతకం గెలుపొందింది. సోమవారం హోరాహోరీగా సాగిన సెమీస్ లో భవాని 14-15 తేడాతో జేనబ్ దాయిబెకోవా(ఉబ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడింది. ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన తొలి భారత ఫెన్సర్ గా ఈ తమిళనాడు అమ్మాయి రికార్డు సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు భవానీ దేవీ కాంస్యం పతకం సాధించంపై భారత ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి అభినందనలు తెలిపారు. భారత ఫెన్సింగ్‌కు ఇది గర్వపడే రోజు అని, గతంలో ఎవరూ సాధించలేనిది ప్రస్తుతం భవాని సాధించిందని భారత ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నారు. ఈ ఛాంపియన్ షిప్స్‌లో మొదటి నుంచి కష్టపడి కఠిన సవాళ్లను ఎదుర్కొని కాంస్యం అందుకోవడం విశేషం. తొలి రౌండ్లో భవానికి భై లభించగా.. రెండో రౌండ్లో డోస్పే కరీనాపై ఆమె గెలుపొందింది. మరోవైపు ఫ్రీ క్వార్టర్స్ లో ఒజాకి సెరిని 15-11తో భవాని చిత్తు చేసింది. ఇక క్వార్టర్స్ లో అయితే ప్రపంచ ఛాంపియన్ షిప్ మిసాకి ఎమూరాను 15-10తో చిత్తు చేసి సత్తా చాటింది.

Post a Comment

0Comments

Post a Comment (0)