రీసెర్చ్ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ అధిపతిగా రవి సిన్హా

Telugu Lo Computer
0


రీసెర్చ్ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ అధిపతిగా 1988 బ్యాచ్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారి రవి సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఈ పదవిలో కొనసాగుతున్న సమంత్‌ కుమార్‌ గోయల్‌ రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు. ఆయనకు ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించింది. జూన్ 30న తన పదవీకాలం పూర్తికానుండగా.. ప్రస్తుత సమంత్ కుమార్ గోయెల్ స్థానంలో రవి సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను 'రా' నిర్వహిస్తోంది.1988 బ్యాచ్ అధికారి అయిన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్నారు. రవి సిన్హా ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన వ్యక్తిగత వివరాలు చాలా వరకు గోప్యంగా ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్‌ విభాగంలో ప్రతిభావంతుడిగా ఆయనకు పేరుంది. ఆయన వివిధ విభాగాల్లో పని చేశారు. పొరుగు దేశాల్లో జరిగే పరిణామాలపై మంచి పట్టుంది. ముఖ్యంగా ఆయన జమ్ముకశ్మీర్‌, ఈశాన్య భారత్‌, వామపక్ష తీవ్రవాదంపై పని చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)