మూడు తలల చీతా !

Telugu Lo Computer
0


ఫ్రికాలోని కొన్ని అడవుల్లో చీతాలు విరివిగా కనిపిస్తుంటాయి. ఒక వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్ మూడు తలల చీతాను తన కెమెరాలో క్యాప్చర్‌ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోవడంతోపాటు, అతను ఎంతో ధైర్యవంతుడైన క్రియేటర్‌ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ అద్భుతమైన ఫొటోను విబుల్డన్‌కు చెందిన వరల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పాల్‌ గోల్డ్‌స్టీన్‌ తన కెమెరాలో బంధించారు. ఈ చీతా కెన్యాలోని మాసై మారా నేషనల్‌ పార్కులో కనిపించింది. పాల్‌ గోల్డ్‌ ఈ ఫొటో గురించి ఒక మీడియా హౌస్‌లో మాట్లాడుతూ తాను ఈ ఫొటో తీసేందుకు 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యానని తెలిపారు. ఈ ఫొటోను ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే 'ఆ క్షణంలో మంత్రముగ్ధుడనయ్యాను. అవును.. ఇందుకోసం ఏడు గంటలు వర్షంలో తడిశాను' అనే కాప్షన్‌ రాశారు.

ఈ పొటోను పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నాయని, అవి వేర్వేరు దిశల్లో చూస్తున్నాయని అనిపిస్తుంది. పొటోగ్రాఫర్‌ పర్ఫెక్ట్‌ టైమింగ్‌ అనేది ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోను చూసినవారంతా 'వారేవాహ్‌.. ఏం టైమింగ్‌రా బాబూ' అని ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటున్నారు. నిజానికి అవి మూడు చీతాలు. అవి ఒక దగ్గరే వేర్వేరు యాంగిల్స్‌లో కూర్చున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)