కదలని నైరుతి రుతుపవనాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో రుతుపవనాలు ప్రవేశించినా ఎండలు తగ్గలేదు. శ్రీహరికోట, పుట్టపర్తి వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు అక్కడ నుంచి ముందుకు కదలటం లేదు. దీంతో ఎండలు, వడగాల్పులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. అక్కడక్కడా వర్షాలు కురిసినా రుతుపవనాలు విస్తరించకపోవటంతో వేడి వాతావరణం కొనసాగుతోంది. తెలంగాణలోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తుఫాను బలహీనపడిన తరువాత ఈ నెల 17 తరువాత ఏపీలోని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అప్పటి వరకు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది.  పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అనకాపల్లి జిల్లా మాడుగులలో 45.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రలు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)