పోస్టింగ్‌ తెచ్చిన తంటా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు చెందిన పత్తి మణి రాజంపేట పట్టణం మన్నూరులోని అత్త ఇంటిలో ఉంటూ రెండు కార్లు బాడుగకు తిప్పుకుంటూ, చికెన్‌ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టింగ్‌ వల్ల తిరుపతికి చెందిన కొందరు వచ్చి తన భర్తను తీసుకెళ్లారని భార్య మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మన్నూరు పోలీసులు, రైల్వేకోడూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఓబులవారిపల్లె నుంచి చిట్వేలికి మణిని తీసుకెళ్లారు. చిట్వేలి పోలీసులు తిరుపతి నుంచి వచ్చిన ఏపీ03బీపీ6666, ఏపీ 39టీ/ఆర్‌లో 14 మందిని పట్టుకొని మన్నూరు ఎస్‌ఐకి అప్పగించారు. మన్నూరు పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేశారు. తాను పెట్టిన పోస్టింగ్‌ వల్లనే దాడి చేశారని, రాజంపేట ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మీడియాకు వెల్లడించారు. మన్నూరులో ఉంటున్న పత్తిమణిపై దాడికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఎటువంటి సంబంధంలేదని రాజంపేట డీఎస్పీ చైతన్య తెలిపారు. ఆదివారం డీఎస్పీ మాట్లాడుతూ మణితో మాట్లాడేందుకు తిరుపతికి చెందిన వారు వచ్చారన్నారు. ఇది కిడ్నాప్‌ సంఘటన కాదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)