అక్క ప్రియుడితో పరార్ - చెల్లి తో వివాహం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని బాందాలోని ఒక ఇంటిలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఇంతలో వధువు తన ప్రియునితో పరారయ్యింది. విషయం తెలియగానే వధువు తండ్రితో పాటు పెళ్లికి హాజరైనవారంతా ఆందోళనకు లోనయ్యారు. అయితే వధువు తండ్రి తన చిన్న కుమార్తెను అదే వరునికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగే తన పెద్ద కుమార్తెను తీసుకువెళ్లిపోయిన యువకునిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం తిద్వారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తె వివాహం జూన్‌ 8న నిశ్చయించామన్నాడు. కన్నౌజ్‌ జిల్లా నుంచి మగపెళ్లివారు వచ్చారన్నారు. ఇంతలో గ్రామానికి చెందిన ఒక యువకుడు తన కుమార్తెను తీసుకువెళ్లిపోయాడని ఫిర్యాదు చేశాడు.అతనిపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరాడు. మగ పెళ్లివారు కల్యాణమండపానికి చేరుకున్నంతలో వధువు తన ‍ప్రియునితో పరారైన విషయం అక్కడున్నవారందరికీ తెలిసింది. వెంటనే వధువు తండ్రి తన చిన్న కుమార్తెతో ఈ వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అతని చిన్న కుమార్తె, వరునితో పాటు అతని తరపువారంతా సమ్మతించారు. దీంతో వివాహ వేడుక యధావిధిగా జరిగింది. ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఒక యువతిని ఒక యువకుడు తీసుకుని వెళ్లిపోయాడంటూ ఫిర్యాదు అందింది. ఆ యువతి తండ్రి దీనిపై ఫిర్యాదు చేశాడన్నారు. ఆ యవతీ యువకులను వెదికేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)