రుతుపవనాల పురోగమనం !

Telugu Lo Computer
0


రుతుపవనాల పురోగమనంతో మంగళవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 11వతేదీన కర్ణాటక, ఏపీ  సరిహద్దుల  వద్ద నిలిచిపోయిన రుతుపవనాలు తిరిగి పురోగమిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుతుపవనాలు సోమవారం కొన్ని జిల్లాలకు విస్తరించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22వతేదీన రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. మంగళ, బుధవారాల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు. వాయువ్య మధ్యప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా. బిపర్ జోయ్ తుపాన్ ప్రభావం వల్ల రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో వరదలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఉరుములు,మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాబోయే ఐదు రోజుల్లో దక్షిణ భారత ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 20వతేదీన తమిళనాడు, కోస్తాంధ్రలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో రానున్న మూడు గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)