రహదారిపై జరిగిన ఘర్షణలో ఐఏఎస్,ఐపీఎస్ సస్పెండ్ !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లో జైపూర్‌-అజ్మీర్‌ జాతీయ రహదారిపై జరిగిన ఘర్షణల్లో ఓ ఐఏఎస్, ఐపీఎస్ అధికారితో సహా ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్ అధికారి, అజ్మీర్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయినట్లు సమాచారం. స్థానిక వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికారి కొత్త ప్రాంతానికి బదిలీ అయినందున ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వెళ్లే క్రమంలో రెస్టారెంట్‌లో వాష్‌రూమ్ వాడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. అనంతరం ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ‍్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎస్ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రెస్టారెంట్ సిబ్బంది కూడా అధికారిపై తిరగబడిన తర్వాత ఘర్షణ మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసులు తమ సిబ్బందిపై ఘర్షణకు దిగారని రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ రిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీసు చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణనలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)