ప్రధాని లేని సమయంలో సమావేశమా ?

Telugu Lo Computer
0


మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు జూన్‌ 24న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. '50 రోజులుగా మణిపూర్ భగ్గుమంటోంది. కానీ ఈ విషయంపై ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. ఆయన దేశంలో లేనప్పుడు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశం ప్రధానికి అంత ముఖ్యం కాదని స్పష్టమవుతోంది' అని రాహుల్ దుయ్యబట్టారు. ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఇదే తరహాలో విమర్శలు చేశారు. మణిపూర్ మండిపోతుంటే.. ప్రధాని అంతర్జాతీయ పర్యటనలో ఉన్నారని విరుచుకుపడ్డారు. జాతుల మధ్య వైరంతో గత కొద్దికాలంగా మణిపూర్ మండిపోతోంది. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం శాంతిస్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఘర్షణలు ఆగడం లేదు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని అమెరికాలో ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)