రాజీకి రావాలని బెదిరిస్తున్నారు !

Telugu Lo Computer
0


రాజీకి రావాలని బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ మనుషులు బెదిరిస్తున్నారని  రెజ్లర్ సాక్షి మాలిక్ ఆరోపించారు. ఫిర్యాదును వెనుకకు తీసుకోవాలని ఒత్తిడి చేసినందునే మైనర్ రెజ్లర్ తండ్రి మాట మార్చారని అన్నారు. 'నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయించాలని మొదటి నుంచి మేం కోరుతున్నాం. బయట ఉండడం వల్ల కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు' అని ఆమె ఆరోపించారు. బ్రిజ్‌ భూషణ్‌పై చేసింది తప్పుడు ఫిర్యాదని బాధిత మైనర్‌ రెజ్లర్‌ తండ్రి మీడియాకు తెలపడంతో అంతా అవాక్కయ్యారు. 2022లో అండర్‌-17 ఛాంపియన్‌షిప్‌ ట్రయల్స్‌ ఫైనల్స్‌లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్‌ డిప్యూటేషన్‌ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు  కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో సమావేశమైన అనంతరం జూన్‌ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని ప్రకటించారు. అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)