శరవేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా !

Telugu Lo Computer
0


మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలో పట్టణీకరణకు మంచి ఊపునిచ్చాయి. పట్టణ ప్రాంతాల జనసంఖ్య వృద్ధితోపాటు దేశ ఆర్థికవ్యవస్థలో నగరాలు, పట్టణాల వాటా కూడా మరింత వేగంగా పెరుగుతోంది. ఇండియాలో పట్టణ ప్రాంతాల జనాభా 1961లో 8.23 కోట్ల నుంచి 1981 నాటికి 16.60 కోట్లకు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 37.7 కోట్ల పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 48 కోట్లకు చేరుకుందని అంచనా వేశారు. అంటే దేశ జనాభాలో ఐదో వంతుకు పైగా పట్టణాలోనే జీవిస్తోందన్న మాట. 2001-2011 దశాబ్దంలో దేశంలో పట్టణ జనాభా ఎన్నడూ లేనంత గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఎక్కువగా వృద్ధిచెందింది. పెరిగిన 18 కోట్ల 14 లక్షల జనాభాలో పట్టణ ప్రాంతాల జనం 9 కోట్ల 10 లక్షలు కాగా, గ్రామీణ ప్రాంతాలది 9 కోట్ల 40 లక్షలు. 2011 నుంచీ పట్టణ ప్రాంతాల్లో జనసంఖ్య శరవేగంతో పెరుగుతోంది. మొత్తం దేశ జనాభాలో ఇదివరకు 18 శాతం ఉన్న పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 37 శాతానికి పెరిగిందని అంచనా. ఐక్యరాజ్యసమితి-హేబిటెట్‌ ప్రపంచ నగరాల జనాభా (2022) నివేదిక ప్రకారం భారత పట్టణ ప్రాంతాల జనాభా 2025 నాటికి 54.74 కోట్లు, 2030కి 60.73 కోట్లు, 2035 నాటికి 67.45 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత స్వాతంత్య్రానికి 100 ఏళ్లు నిండిన మూడు సంవత్సరాలకు అంటే 2050 కల్లా పట్టణ ప్రాంతాల జనసంఖ్య 81.4 కోట్లకు పెరిగిపోతుందని ఐరాస అంచనాలు సూచిస్తున్నాయి. అంటే, దేశంలో పట్టణాల జనాభా గ్రామీణ జనాభా కంటే చాలా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)