పరిహారం కోసం నాటకాలకు తెరలేపారు !

Telugu Lo Computer
0


ఒడిశా రైలు ప్రమాదం ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికీ మృతుల్లో కొంతమందిని గుర్తించలేదు. అయితే ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని కొందరు దురశాపరులు నాటకాలకు తెరలేపారు. మృతులు కోసం ఇచ్చే పరిహారాన్ని కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నకిలీ ధృవపత్రాలు చూపిస్తూ ఎవరు గుర్తించలేని మృతదేహాలను తమ కుటుంబ సభ్యులుగా నమ్మించి మృతదేహాలు తీసుకుంటున్నారు. ఈ మోసం ఎలా బయటపడిందంటే కటక్‌కు చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ ఆదివారం బాలేశ్వర్‌లోని మృతుల ఫొటోలను ఉంచిన ప్రదేశానికి వచ్చింది. రైలు ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణించాడని, అతని ఆచూకీ ఇప్పటిదాకా తెలియడంలేదని పోలీసులకు చెప్పింది. అక్కడున్న ఫొటోలను చూసుకోవాలని పోలీసులు చెప్పగా.. అందులోంచి ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ.. అతడే తన భర్త అని చెప్పింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు పోలీస్‌స్టేషన్‌లో విచారించగా ఆమె భర్త బతికే ఉన్నాడని తేలింది. దీంతో గీతాంజలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఇలా చేసినట్లు తెలిపింది.ఈ మోసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై కఠినందా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)