యువకుడ్ని బెల్టుతో చితకబాదిన కొట్టిన యువతులు !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు విజయ్‌ సర్కారే గత కొద్దిరోజుల నుంచి ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్ల వెంట పడి వేధిస్తున్నాడు. రోజూ వారి వెంట పడి లైంగికంగా ఇబ్బంది పెట్టేవాడు. ఓ రోజు అక్కాచెల్లెళ్లలోని ఓ యువతిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. దీంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. నడిరోడ్డుపై అతడిపై తిరగబడ్డారు. అపరకాళికల్లా మారి విజయ్‌పై దాడికి దిగారు. వీరికి రోడ్డుపై వెళుతున్న వారు కూడా సాయం వచ్చారు. ఇక, ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు ఆ యువకుడిని రోడ్డుపై పడేసి కొట్టారు. అక్కాచెల్లెళ్లలోని ఓ అమ్మాయి అతడ్ని బెల్టుతో విచక్షణా రహితంగా కొట్టింది. అతడు దెబ్బలు తిన్నాడే తప్ప ఎదురు తిరగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. '' ఈ కాలంలో ఆడపిల్లలు ఇలా ఉంటేనే బతుకుతారు''.. '' అలాంటి వెధవలకు అలానే బుద్ది చెప్పాలి'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Post a Comment

0Comments

Post a Comment (0)