ఢిల్లీ మెట్రోలో మద్యం తీసుకెళ్లవచ్చు, తాగకూడదు !

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రో రైలులో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. మద్యం బాటిల్స్ తీసుకెళ్లవచ్చు కానీ మెట్రో రైలులో మద్యాన్ని సేవించకూడదని తేల్చి చెప్పింది. మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఢిల్లీ మెట్రో స్పందించింది. ఎయిర్ పోర్టు ఎక్స్‌ప్రెస్‌ లైన్‌లోని నిబంధనలతో సమానంగా ఢిల్లీ మెట్రలో ఒక ప్రయాణికుడు పూర్తిగా సీలు చేసిన రెండు మద్యం బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నట్లు ప్రకటించింది. మెట్రో రైలులో గానీ మెట్రో ప్రాంగణంలో మద్యం సేవించడం ఇప్పటికీ కచ్చితంగా నిషేధమని స్పష్టం చేసింది. మద్యం రవాణా చేయడాన్ని నిషేధించిన గత ఆదేశాలను సమీక్షించిన తరువాత ఢిల్లీ మెట్రో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం తాగిన మత్తులో ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా ఢిల్లీ మెట్రోలో పదునైన వస్తువులు, పేలుడు పదార్ధాలు, తుపాకులు, డిసేబుల్ కెమికల్స్‌తో పాటు ఇతర ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లటం నిషేధం.      https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)