ఢిల్లీలో భారీ వర్షం !

Telugu Lo Computer
0


ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయిలో నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు వణికి పోయారు. సాధారణ ఉష్ణోగ్రత 39.3 డిగ్రీల సెల్సియస్. కానీ నిన్న సాధారణ ఉష్ణోగ్రతల కంటే 13 డిగ్రీలు తగ్గి 26.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం 2011 తర్వాత ఇదే తొలిసారి. ఆదివారం రోజు 28.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది మే 1వ తేదీన ఇదే ఢిల్లీలో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2021లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నిన్న ఢిల్లీ అంతటా చాలా చలిగా ఉంది. ఈ ఏడాది మార్చి 18వ తేదీన 25.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ వ్యాప్తంగా మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)