బ్యాంకులో డిపాజిట్ చేయమని డిపాజిట్ చేయమని డబ్బులిస్తే ఉడాయించిన డ్రైవర్ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ యజమాని తన డ్రైవరుకు రూ. 49 లక్షలు నగదునిచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమని చెబితే ఆ డ్రైవర్ అతితెలివితేటలు ప్రదర్శించి డబ్బులతో సహా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో కంపెనీ యజమాని పోలీసులను ఆశ్రయించగా లక్నో పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టి  పోలీసులు హజరత్ గంజ్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రానిక్స్ కంపెనీలో డ్రైవరుగా పనిచేస్తోన్న రాహుల్ కు ఆ కంపెనీ యజమాని రూ. 49 లక్షలు ఉంచిన రెండు బ్యాగులను ఇచ్చాడు. ఊహించని విధంగా భారీమొత్తంలో డబ్బు చేతికందడంతో ఆ డ్రైవరుకు బుద్ధి పట్టాలు తప్పింది. ఎంత కష్టపడినా ఇంత పెద్ద మొత్తంలో డబ్బుని సంపాదించడం కష్టం అనుకుని అప్పటికప్పుడు డబ్బుతో సహా ఊరు దాటే ప్రయత్నం చేశాడు. అంతలోనే కంపెనీ యజమాని పోలీసు కంప్లైంట్ ఇవ్వగా... రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడపట్టి లక్నో నడిబొడ్డున ఉన్న హజరత్ గంజ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారుని గుర్తించారు. పోలీసు బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకొని కారులోనే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడు దోచుకున్న మొత్తం సొమ్మను రికవర్ చేసినట్లు లక్నో డీసీపీ వినీత్ జైస్వాల్  తెలిపారు. ఎలక్ట్రానిక్స్ కంపెనీ యజమాని పూర్వ భుగ్రా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్లో యజమాని నమ్మకాన్ని వమ్ము చేసినందుకు IPC 408 సెక్షన్, నిజాయతీగా వ్యవహరించనందుకు IPC 411 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు డీసీపీ. విచారణలో రాహుల్ చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. నేను చాలా కాలంగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది కాబట్టి నాకు ఇచ్చింది బ్లాక్ మనీ అయి ఉంటుందనుకున్నా. ఈ సొమ్మును దోచుకున్నా కూడా యజమాని ఎవ్వరికీ చెప్పుకోలేరనుకున్నానని అన్నాడు. కానీ యజమాని పోలీసులను ఆశ్రయించడంతో డ్రైవర్ ఖంగుతిన్నాడు. అత్యాశకు పోయినందుకు తగిన మూల్యం చెల్లించి కటకటాల పాలయ్యాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)