నల్ల డబ్బు దాచుకున్న వారికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది !

Telugu Lo Computer
0


రూ.2000 నోటును తీసుకురావడమే ఒక తెలివితక్కువ చర్య అని, ఇప్పుడైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు సంతోషం అంటూ వ్యాఖ్యానించారు. నల్ల డబ్బు దాచుకునేవారి కోసమే ఈ పెద్ద నోటు ఉపయోగపడిందని ఆర్బీఐ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విమర్శించారు. ప్రస్తుతం సామాన్యుల వద్ద రూ.2000 నోట్లు లేవని, రోజువారీ అవసరాలకు రూ.2 వేల నోట్లను ఉపయోగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెద్ద నోట్లను ఉపయోగిస్తున్నది ఎవరు? అని చిదంబరం ప్రశ్నించారు. ఎలాంటి పత్రాలు నింపాల్సిన అవసరం లేకుండా, ఐడెంటిటీ కార్డులతో పని లేకుండా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని బ్యాంకులు చెబుతున్నాయని, ఇప్పుడు కూడా నల్ల డబ్బు దాచుకున్న వారికే ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని దీన్నిబట్టే అర్థమవుతోందని తెలిపారు. సులభంగా మార్చుకోవచ్చంటూ నల్లడబ్బు దాచుకున్నవారికి బ్యాంకులు సాదర స్వాగతం పలుకుతున్నాయని చిదంబరం విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)