'ది కేరళ స్టోరీ'కి వినోదపు పన్ను మినహాయింపు !

Telugu Lo Computer
0


'ది కేరళ స్టోరీ' సినిమాకు వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. 'ది కేరళ స్టోరీ' చిత్రం లవ్ జిహాద్, మతమార్పిడి, ఉగ్రవాదం కుట్రలను బట్టబయలు చేసి దాని వికృత రూపాన్ని బయటపెడుతుందని చౌహాన్ అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై మనకు అవగాహన కల్పిస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చామని చౌహాన్ వెల్లడించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, ముఖ్యంగా ఆడపిల్లలు తప్పకుండా చూడాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అందుకే ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చామని ఆయన వెల్లడించారు. అదా శర్మ కీలక పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ మే 05 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లవ్ జిహాద్ పేరిట కేరళలో 32 వేల మందికిపైకా అమాయక యువతులను ట్రాప్ చేసి ఐసిస్ లో చేర్చారని చెబుతూ తెరకెక్కించారు. ఈ చిత్రంపై కేరళ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు, కొంతమంది హెచ్చరించడంతో భయపడి కేరళలో షోలని క్యాన్సిల్ చేశాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)