మేడపై నిద్రిద్దామన్నందుకు భార్యతో గొడవపడి కూతురిని పొడిచి చంపేశాడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 20 May 2023

మేడపై నిద్రిద్దామన్నందుకు భార్యతో గొడవపడి కూతురిని పొడిచి చంపేశాడు !


గుజరాత్‌ లో మేడపై నిద్రిద్దామన్న భార్యతో గొడవకు దిగి.. అడ్డుకోబోయిన కూతురిని దారుణంగా పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన రామానుజ్‌ మహాదేవ్‌ సాహు, రేఖాదేవి దంపతులు జిల్లాలోని కడోదర ప్రాంతంలో నివసిస్తుంటారు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉంది. గురువారం రాత్రి రేఖాదేవి మేడపై నిద్రిద్దామని భర్తను కోరింది. ఇందుకు అభ్యంతరం చెప్పిన మహాదేవ్‌ భార్యతో గొడవకు దిగాడు. ఆ తరువాత ఇంట్లోంచి వెళ్లిపోయిన అతడు కత్తితో తిరిగొచ్చి భార్యపై దాడికి దిగాడు. ఈ క్రమంలో తనకు అడ్డొచ్చిన 19 ఏళ్ల కూతురిపై దాడి చేశాడు. దీంతో ఆమెకు 17 చోట్ల కత్తి గాయాలయ్యి మృతి చెందింది. ఈ ఘటనలో అతడి ముగ్గురు కుమారులు కూడా గాయపడ్డారు. కూతురిని హత్య చేశాక పరారైన నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

No comments:

Post a Comment