భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని వనస్థలిపురంకి చెందిన మనోజ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో సాహితికి వివాహం జరిగింది. వారిద్దరూ అమెరికా లో నివాసముంటున్నారు. ఈనెల రెండున సాహితి డీడీ కాలనీలో ఉండే తన తల్లితండ్రులను చూడడటానికి ఇండియాకు వచ్చింది. అయితే 20వ తేదీన సాహితి భర్త మనోజ్ అమెరికాలో హార్ట్‌ స్ట్రోక్‌తో హఠాన్మరణం చెందాడు. అతడి మృతదేహం 23వ తేదీన ఇండియాకు వచ్చింది. అశ్రునయనాల మధ్య 24వ తేదీన వనస్థలిపురంలో మనోజ్ అంత్యక్రియలు జరిగాయి. అనంతరం సాహితి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన తల్లిదండ్రులతో డీడీ కాలనీలోని ఇంటికి వచ్చింది. రాత్రి సాహితి, ఆమె చెల్లెలు సంజన కలిసి ఒకే రూమ్‌లో పడుకున్నారు. గురువారం ఉదయం 09:20 గంటల సమయంలో సంజన వాష్ రూమ్‌కి బయటకు వెళ్లి 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది. అప్పటికే లోపల నుంచి గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా లోపలి నుంచి రెస్పాన్స్ లేదు. అనుమానంతో తలుపు బద్దలుకొట్టి చూడగా సాహితి చీరతో ఫ్యాన్‌కి ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)