కొడుకును గొంతుకోసి చంపిన కసాయి తండ్రి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 16 May 2023

కొడుకును గొంతుకోసి చంపిన కసాయి తండ్రి


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలోని తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింబోడి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని ప్రతీక్ ముండేగా గుర్తించారు. నిందితుడిని శశిపాల్ ముండే (26)గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మొదటి భార్యకు పుట్టిన కొడుకు వల్ల రెండో భార్యతో గొడవలు వస్తుండటంతో.. అతడిని అడ్డుతొలగించుకునేందుకు కన్నతండ్రే అంతమొందించాడు. రెండో భార్య కాపురానికి రావట్లేదని ఈ దారుణానికి తెగబడ్డాడు. ఇండోర్‌ జిల్లాలోని తేజాజీ నగర్ ఏరియాలో శశిపాల్ ముండే (26) నివాసముంటున్నాడు. అతని మొదటి భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. వారికి ఏడేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. మొదటి భార్య చనిపోవడంతో.. శశిపాల్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి భార్య కొడుకుని చూసుకోవడంలో రెండో భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లాడిని తాను చూసుకోలేనని తేల్చి చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ పిల్లాడు ఇంట్లో ఉన్నంతవరకూ తాను కాపురానికి రాబోనని స్పష్టం చేసింది. రెండో భార్య చేష్టలకు విసిగిపోయిన శశిపాల్.. కొడుకును అడ్డుతొలగించుకోవాలని భావించాడు.3వ తరగతి చదువుతున్న ప్రతీక్ సాధారణంగా తన తాతయ్యతో కలిసి పడుకునేవాడు. ఆదివారం అతని తండ్రి శశిపాల్ ముండే, కూలర్ ఉన్న తన గదిలో పడుకోమని చెప్పాడు. కూలర్ గురించి ఉత్సాహంగా ఉన్న బాలుడు, తన తండ్రి గదికి వెళుతున్నట్లు తన తాతకు చెప్పాడు. అదే వాళ్లు అతన్ని సజీవంగా చివరిసారిగా చూడడమని పోలీసులు వెల్లడించారు. కొడుకు నిద్రపోవడంతో శశిపాల్ టీవీ వాల్యూమ్ పెంచి కత్తితో గొంతు కోసం హత్య చేశాడు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న శశిపాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంధువుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేసేందుకు వెతుకుతున్నట్లు తేజాజీ నగర్‌ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఎస్‌ తన్వర్ తెలిపారు. నిందితుడి గురించి ఏదైనా సమాచారం వస్తే తెలియజేయాలని ప్రాంత స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. రెండో భార్య పాయల్‌కు కూడా ఓ మగబిడ్డ జన్మించాడు. శశిపాల్ తన కొడుకు ప్రతీక్‌ను వదిలించుకుంటే తప్ప ఆమె తన తల్లిదండ్రుల ఇంటి నుండి తిరిగి రాదని శశిపాల్‌కి చెప్పింది. తన కుమారుడిని చంపేటప్పుడు శశిపాల్‌ రుజువు కోసం వీడియో కూడా తీశాడు. ఆ వీడియోను ఆమెకు పంపించాడు. ఆమె అతని మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసినందున ఆమె దానిని చూడలేకపోయింది. శశిపాల్ ముండే మొబైల్ ఫోన్‌లో హత్యకు సంబంధించిన వీడియో క్లిప్ లభ్యమైంది. ఈ నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రెండో భార్య పాయల్ వ్యాఖ్యానించింది. తన ఏడేళ్ల కుమారుడిని చంపమని తన భర్తకు ఎప్పుడూ చెప్పలేదని ఆమె మీడియాతో అన్నారు.

No comments:

Post a Comment