గన్నవరం వస్తా రెడీయా ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 18 May 2023

గన్నవరం వస్తా రెడీయా ?


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు  విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన రేపు గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు. ప్రజా చార్జిషీట్‌పై చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్‌ చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని వచ్చినా కట్టకట్టుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు వచ్చినా నేను రెడీ అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని, కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని చెప్పగలరా ? అంటూ సవాల్‌ చేశారు.. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ బంధువుల ఆస్తుల వ్యత్యాసం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. 2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలమైన ఓటే లేనప్పుడు చీలిక అనే ప్రస్తావనే రాదన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీ, ఇప్పుడు స్నేహం కోసం వెంపర్లాడుతోందంటూ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలను గెలవబోతోందని జోస్యం చెప్పారు.. మరోవైపు  ఏపీలో తాగడానికి నీళ్లు లేవు, కానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారు. రేపు గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోంది.. 2024 ఎన్నికల మీద కీలకమైన చర్చ జరుగుతుందని, భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు.

No comments:

Post a Comment