మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి మృతి చెందిన చిన్నారి మౌనిక కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండగా నిలిచారు. మౌనిక కుటుంబ సభ్యులను మంత్రి తలసాని సోమవారం ఉదయం పరామర్శించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును మంత్రి తలసాని సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు వారి నివాసంలో అందజేశారు. తమ బిడ్డను తలుచుకుంటూ రోదిస్తున్న మౌనిక తల్లిదండ్రులు శ్రీనివాస్, రేణుకలను మంత్రి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అభంశుభం తెలియని చిన్నారి మృతి ప్రతి ఒక్కరినీ ఎంతో కలచి వేసిందని చెప్పారు. ఎంత చేసినా చిన్నారి లేని లోటును ఆ కుటుంబానికి తీర్చలేనిదని పేర్కొన్నారు. కడు పేదరికంలో ఉన్న మౌనిక కుటుంబం అవసరాలను తెలుసుకొని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నగరంలో కోట్లాది రూపాయాల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టి నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా నే పలు కాలనీలు, బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్యను పరిష్కరించినట్లు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)