వికటించిన లిప్ ఫిల్లర్ !

Telugu Lo Computer
0


సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, జెస్సికా బుర్కో తాను ఎదుర్కొన్న ఓ బాధాకరమైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. లిప్ ఫిల్లర్స్ వల్ల తాను పడిన ఇబ్బందులను చెప్పుకొచ్చారు. గతంలో ఆరుసార్లు లిప్ ఫిల్లర్స్ ను ట్రై చేసిన జెస్సికా.. ఇంతకుముందెన్నడూ ఈ తరహా చర్యను పొందలేదని వర్ణించింది. ఈ ప్రక్రియ తర్వాత ఆమె పెదవులు అనియంత్రితంగానే ఉబ్బడం ప్రారంభించాయి. దాని కోసం ఆమె ఇంజెక్టర్ల వద్దకు వెళ్లినా  స్టెరాయిడ్‌ను ఉపయోగించినా వాపు మాత్రం తగ్గలేదు సరి కదా మరింత తీవ్రమైంది. ఈ విషయాన్ని టిక్ టాక్ వేదికగా వెల్లడించిన జెస్సికా.. ఉచిత బహుమతుల ప్రలోభాలకు ఎవరూ గురికావద్దని సూచించింది. ఆతర్వాత ఏదైనా తప్పు జరిగినా విస్మరించవద్దని హెచ్చరించింది. ఏదైనా కాస్మెటిక్ ను ఉపయోగించే ముందు దాని వల్ల కలిగే నష్టాల గురించి పూర్తిగా తెలుసుకునేలా చూసుకోవాలని ఓ వీడియో ద్వారా తెలిపింది. కొంతమంది నెటిజన్లు జెస్సికా రూపాన్ని చూసి ఎగతాళి చేయగా.. మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కార్టూన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ బిగ్ మౌత్‌లోని పాత్రతో పోలుస్తూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరేమో "బిగ్ మౌత్ కోసం ఆడిషన్ చేయాలి" అంటూ కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)