తొమ్మిదేళ్లలో రెండు వేలకు పైగా చట్టాలను ప్రధాని మోడీ రద్దు చేశారు !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ  నేతృత్వంలోని ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం గత తొమ్మిదేళ్లలో వాడుకలేని 2వేల పైగా రూల్స్, చట్టాలను రద్దు చేసిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. మునుపటి ప్రభుత్వాలు హోదా విధానంలో ఉదార స్వభావాన్ని చూపిందని, అలా కాకుండా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే అటువంటి నిబంధనలను తొలగించే ధైర్యాన్ని ప్రధాని మోడీ  ప్రదర్శించారని అన్నారు. బ్రిటీష్ కాలం నాటి రూల్స్, చట్టాలను పౌరులపై బలవంతంగా రుద్దబడ్డాయని తెలిపారు. పౌరులకు జీవన సౌలభ్యాన్ని తీసుకురావడమే ప్రధాని మోదీ ప్రభుత్వ అంతిమ లక్ష్యం అని తెలిపారు. 2014 మేలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గెజిటెడ్ అధికారులతో సర్టిఫికెట్లు పొందే విధానానికి రెండు, మూడు నెలల్లోనే స్వస్తి పలికిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత సంవత్సరం లోపే, ఉద్యోగ నియామకాలలో ఇంటర్వ్యూల రద్దుపై ఓ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, పౌరుల భాగస్వామ్యాన్ని తీసుకురావడానికి వివిధ విభాగాల్లో పని విధానాన్నిఆన్‌లైన్‌లోకి మార్చామన్నారు. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ కి మార్చామని, దీని ఫలితంగా ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయని, అంతకు ముందు ప్రతి ఏడాది కేవలం 2 లక్షల ఫిర్యాదులు మాత్రమే వచ్చేవని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)