సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీకి  బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ తమిళిసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున ఎప్పటిలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఈసారి కూడా మోడీ అధికారిక పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం పలకాల్సి ఉంటుంది. కానీ సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించడం లేదు. గతంలో ప్రధాని మోడీ వచ్చిన ఏ సందర్భంలోను కేసీఆర్ వెళ్ళకపోవడం గమనార్హం. ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించారు. స్టేజ్ పై ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కు, స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డికి అలాగే మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీకి కూడా చైర్లు వేశారు. కానీ కేసీఆర్ సహా ఇతర మంత్రులు ఎవరూ కూడా ఈ సభలో పాల్గొనలేదు. ప్రధాని నరేంద్ర మోడీ  సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభించారు. దీని వల్ల అటు తెలంగాణ , ఇటు ఏపీ ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా తిరుమల వెళ్లాలని భావించే భక్తులకు ఈ ట్రైన్ చాలా అనువుగా ఉంటుంది. రైల్వే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. దేశంలో అందుబాటులోకి వచ్చిన 12వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇదే కావడం గమనార్హం.


Post a Comment

0Comments

Post a Comment (0)