అదానీ కంపెనీలపై దర్యాప్తు కోసం విపక్షాల సమైక్య పోరు

Telugu Lo Computer
0


అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్ రీసెర్చి వ్యవహరంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు అవసరమని, తమ పార్టీ ఈ డిమాండ్‌కు మద్దతిస్తుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. దర్యాప్తు తీరుపై కాంగ్రెస్‌, ఎన్‌సీపీల మధ్య నెలకొన్న విభేదాల గురించి దాటవేశారు. అదానీ కంపెనీలపై దర్యాప్తు జరిపించాలని విపక్షాలు కోరుతున్నాయని, శివసేన (యూబీటీ) కూడా విపక్షాల డిమాండ్‌ను సమర్ధిస్తోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణతో పాటు జేపీసీ దర్యాప్తు కూడా సమాంతరంగా చేపట్టవచ్చని అన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అయితే అవినీతిని మాత్రం కాదని రౌత్ తేల్చిచెప్పారు. కాగా అదానీ గ్రూప్‌లో అవకతవకలపై హిండెన్‌బర్గ్ నివేదిక టార్గెట్ చేస్తూ సాగిందని, ఈ ఉదంతంపై జేపీసీ కోసం పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన దేశ ఆర్ధికవ్యవస్ధకు విఘాతమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. జేపీసీలో బీజేపీ మెజారిటీ ఉంటుందని పవార్ చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)