బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Telugu Lo Computer
0


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యూ ఢిల్లీ లోని 12, తుగ్లక్ లేన్ రోడ్‌లోని తన అధికారిక బంగళాను ఖాళీ చేస్తున్నారు. సూరత్ కోర్టు జైలు శిక్ష , తరువాత ఆయన ఎంపి పదవి పోవడంతో ఈ నెల 22లోగా అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని అధికారుల నుంచి నోటీసు వెలువడింది. ఈ నేపథ్యంలో ఆయన తమ సామాన్లు తరలిస్తున్నారు. ఇక్కడ రెండు ట్రక్కుల్లో సామానును ఆయన తల్లి సోనియా గాంధీకి చెందిన 10, జన్‌పథ్ నివాసానికి తరలించారు. ఇక ఆయన గడువు ముందే ఈ బంగళా వీడుతారని సన్నిహితులు తెలిపారు. రాహుల్ ఇక తల్లి నివాసంలోనే ఉంటారని వెల్లడైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)