రాజ్‌పుత్ ఓట్లను చీల్చేందుకే ఆనంద్ మోహన్ ను విడుదల చేశారు !

Telugu Lo Computer
0


గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ ను జైలు నుంచి విడుదల చేస్తూ బీహార్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్‌పుత్ ఓట్లను చీల్చేందుకు వ్యూహాత్మకంగా గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్‌ను విడుదల చేశారని మాజీ ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య భార్య ఉమాదేవి ఆరోపించారు. గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను హత్య చేయించారు. బీహార్‌లోని దిగువ కోర్టు 2007లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్త ఆనంద్ మోహన్ కు మరణశిక్ష విధించింది. పాట్నా హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది, దీనిని 2012లో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ''డ్యూటీలో ఉండగా ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషులకు బీహార్ సర్కారు జైలు శిక్షను తగ్గించింది. దీనిపై మేం సంతోషంగా లేం, బీహార్‌లో కుల రాజకీయాలు ఉన్నాయి, ఆనంద్ రాజ్‌పుత్ కాబట్టి తన సామాజికవర్గం ఓట్లను సంపాదించగలడు. అందుకే అతన్ని జైలు నుంచి విడుదల చేస్తున్నారు. లేకపోతే జీవిత ఖైదీని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? జైలు నుంచి వచ్చిన నేరస్థుడికి ఎన్నికల టిక్కెట్‌ ఇస్తారు'' అని ఉమాదేవి అన్నారు.ఎన్నికల్లో రాజ్‌పుత్‌ల ఓట్లను దండుకునేందుకే గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్‌ను విడుదల చేస్తున్నారని మాజీ ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య భార్య ఉమాదేవి అన్నారు. గత రెండేళ్లుగా సింగ్‌ను త్వరగా విడుదల చేయాలని పలువురు రాజ్‌పుత్ రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తాను తన మాజీ సహోద్యోగికి అండగా ఉంటానని పలు సందర్భాల్లో చెప్పారు. సోమవారం నాడు ఆనంద్ మోహన్ కుమారుడు చేతన్ ఆనంద్ నిశ్చితార్థానికి నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)