యోగి బెదిరింపు కాల్ కేసులో ప్రేమ కోణం!

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌ ప్రాణాలకు హాని చేస్తామంటూ 112 నంబర్‌కు ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆ కాల్‌ను ట్రేస్‌ చేసిన లఖ్‌నవూ పోలీసులు ఫోన్‌ యజమాని సజ్జాద్‌ హుస్సేన్‌గా గుర్తించి ఆయన్ను కలిశారు. దీంతో రెండు రోజుల క్రితమే తన ఫోన్‌ చోరీకి గురైనట్టు అతడు చెప్పాడు. ఇరుగుపొరుగువారిని వాకబు చేయగా అమీన్ అనే యువకుడు తన ప్రియురాలి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించేందుకు ఇలా చేసి ఉంటాడని పోలీసులకు తెలిపారు. దీంతో 18 ఏళ్ల అమీన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ తండ్రి సజ్జాద్‌తో గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆవేశంతో తన ప్రేయసి తండ్రి సజ్జాద్‌ హుస్సేన్‌ ఫోన్‌ను చోరీ చేసి, అతడిని కేసులో ఇరికించేందుకే సీఎంకు బెదిరింపులు జారీ చేస్తూ 112 నంబర్‌కు కాల్‌ చేశాదని వివరించారు. నిందితుడిపై ఫోన్ దొంగతనంతో పాటు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి లఖ్‌నవూ కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)