'మీడియావన్‌'పై కేంద్ర ప్రభుత్వ నిషేధాన్ని రద్దు చేసిన సుప్రీం

Telugu Lo Computer
0


మలయాళ న్యూస్‌ ఛానెల్‌ 'మీడియా వన్ పై భద్రతా క్లియరెన్స్‌ కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యూస్‌ ఛానెల్‌ టెలికాస్ట్‌ను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ ఛానెల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరకంగా చేసిన ఛానెల్‌ ప్రసారాలను పత్రికా వ్యవస్థ విరుద్ధమైనవిగా పరిగణించలేమని సుప్రీం అభిప్రాయపడింది. పటిష్టమైన ప్రజాస్వామ్యానికి స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరమని డివై చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే 'జాతీయ భద్రతా క్లెయిమ్‌లను గాలి నుండి తయారుచేయడం సాధ్యం కాదని, దానికి మద్దతునిచ్చే భౌతిక వాస్తవాలు ఉండాలి' అని బెంచ్‌ పేర్కొంది. ఈ ఛానెల్‌పై జాతీయ భద్రతా వాదనలను లేవనెత్తినందుకు హోమ్‌ మంత్రిత్వశాఖను సుప్రీం నిలదీసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)