కోవిడ్ కేసులపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

Telugu Lo Computer
0


కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా కోవిడ్ కేసులు, నిర్వహణ చర్యలపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరగకుండా అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 10, 11 తేదీల్లో అన్ని హాస్పిటల్స్‌లో సన్నాహక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నెల8, 9 తేదీల్లో జిల్లా ఉన్నతాధికారులు, ఆరోగ్యశాఖ అధికారులతో కోవిడ్ చర్యలపై సమీక్షించాలని ఆరోగ్య మంత్రులను కోరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)