బైక్‌పై ఆకతాయి చేష్టలు !

Telugu Lo Computer
0


ముంబయిలో ఓ యువకుడు రాత్రి వేళ ఇద్దరు యువతులను బైక్‌పై ముందూ వెనుక కూర్చోబెట్టుకొని ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగుచూసింది. ముగ్గురిలో ఎవరికీ హెల్మెట్‌ లేదు. వెనుక చక్రం ఆధారంగా వాహనాన్ని గాల్లోకి లేపి నడపటం చూపరులకు గగుర్పాటు కలిగించేలా ఉంది. ఈ ముగ్గురిపై ముంబయి బీకేసీ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. జరిమానా విధించి వదిలేయకుండా చట్టపరమైన కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బైక్‌ నడుపుతున్న వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు నిందితుల ఆచూకీ ఆరా తీస్తున్నామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)