హంతకుడిని పట్టించిన ప్లాస్టిక్ బ్యాగ్ !

Telugu Lo Computer
0


గతవారం గురుగ్రాంలో జరిగిన మహిళ హత్యకు సంబంధించి ప్లాస్టిక్ బ్యాగు కీలక సాక్ష్యంగా మారింది. ఆ బ్యాగు ద్వారానే హత్య కేసును చేధించి హంతకుడిని పట్టుకన్నారు పోలీసులు. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం మహిళను హతమార్చింది ఆమె భర్తనే. వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉండడం వల్లే భార్యను హతమార్చినట్లు పోలీసుల ముందు హంతకుడు ఒప్పుకున్నాడు. హంతకుడి పేరు జితేందర్ (34), నేవీలో కుక్ ‭గా పని చేసి 2022లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతడికి వేరొక మహిళలతో శారీరక సంబంధం ఉంది. ఇది భార్యకు తెలిసిందనే కారణంతో ఆమెను హతమార్చాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే జితేందర్ ‭ను అనుమానితుడిగా చేర్చిన పోలీసులు  ఆ కోణంలో కేసు విచారణ చేపట్టారు. అతడికి సంబంధించిన కదలికలను పరిశీలించడం ప్రారంభించారు. జితేందర్ భార్య మొండెం కనిపించిన గదిలో, విశాఖపట్నానికి చెందిన ఒక కంపెనీ పేరుతో ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ పోలీసులకు దొరికింది. బ్యాగు పేరున్న కంపెనీ విక్రేతను వివరాలు కనుక్కోగా భారత నేవీకి ఆ రకమైన బ్యాగ్‌లను సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. అనంతరం సీసీటీవీ పుటేజీలు పరిశీలించగా ఒక సీసీటీవీ పుటేజీకి జితేందర్ చిక్కాడు. తన బైక్ మీద వెళ్లేప్పుడు నిండుగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. తిరిగి వచ్చేప్పుడు ఖాళీ బ్యాగుతో వచ్చాడు. దీన్ని ఆధారం చేసుకుని జితెందర్ ‭ను కస్టడీలోకి తీసుకుని విచారించగా తానే తన భార్య సోనియా శర్మ(28)ను చంపిన విషయాన్ని ఒప్పుకున్నాడు. తనకు వేరొక మహిళతో శారీరక సంబంధం ఉందని, దాని గురించి ఆమెకు తెలిసిందని, అందుకే చంపినట్లు వెల్లడించాడు. అంతే కాదు, తన ఎనిమిదేళ్ల కూతురిని కూడా హతమార్చాడు. ఈ విషయాన్ని కూడా ఒప్పుకున్నాడు. వేరొక మహిళను రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా అంగీకరించాడు. ఆమెను హతమార్చిన అనంతరం, వివరాలు దొరక్కుండా ఉండడానికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో వాటిని పడేశాడు. ఇంట్లో మిగిలిన కొన్ని భాగాల్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు మొదటగా చనిపోయిన మహిళ కాళ్లు లభించాయి. గురువారం మనేసర్‌లోని ఒక ప్రదేశం నుండి ఆమె తలను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగింది ఒక ప్రదేశంలో అనంతరం విడి భాగాలు భిన్న ప్రదేశాల్లో లభించడంతో భర్త మీద అనుమానంతో విచారణ ప్రారంభించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. జితేందర్‌ను శుక్రవారం సిటీ కోర్టులో హాజరుపరిచి మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు తరలించినట్లు విచారణ అధికారి లలిత్ కుమార్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)