ఐఐటీ మద్రాస్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 2 April 2023

ఐఐటీ మద్రాస్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య


మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్ డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి సచిన్ వేలచ్చేరిలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది మూడు నెలల కాలంలో ఇది మూడో ఆత్మహత్య, మొత్తంగా 2018 నుంచి 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్చి 31న మరణించిన విద్యార్థి ' ఐ యామ్ సారీ నాట్ గుడ్ ఇనఫ్ ' అనే వాట్సాప్ స్టేషస్ ను పోస్ట్ చేశాడు. ఈ స్టేటస్ చూసిన అతడి స్నేహితులు అతని రూంకు చేరుకునే సమయానికి విద్యార్థి సచిన్ ఉరివేసుకుని కనిపించాడు. స్నేహితులు పోలీసులకు సమచారం అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతు ఐఐటీ-మద్రాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు మార్చి 14న మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైపు పుష్పక శ్రీసాయి (20) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 14న మహారాష్ట్రకు చెందిన ఓ రీసెర్చ్ స్కాలర్ ఐఐటీ క్యాంపస్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

No comments:

Post a Comment