ఎండలు మండుతున్నాయి !

Telugu Lo Computer
0


కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని అలప్పుజా, కొట్టాయం, కన్నూర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం 54 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తోంది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్‌లోని ప్రధాన ప్రాంతాలలో కూడా గురువారం 45 నుంచి 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలకు మించవు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్న ఐఎండీ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై మార్చి 1 నుంచి రోజువారీగా నిఘా ఉంచాలని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)