బోరుబావి నుంచి బంగారం ?

Telugu Lo Computer
0


ఒడిశాలోని బలంగీర్ జిల్లా ఖప్రఖోల్ బ్లాక్ పరిధిలోని నందుపాల గ్రామంలో ఒక ప్రైవేట్ భూమిలో బోరు బావి నుంచి పసుపు కలర్ పొడి వచ్చింది. మార్చి 8న మహ్మద్ జావేద్ అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో బోరు వేశాడు. శుక్రవారం, జావేద్ కొత్తగా తవ్విన బోర్‌వెల్ నుంచి బురద నీరు, మట్టి అవశేషాలను బయటకు వచ్చాయి. మట్టి, బురద నీటితో బంగారం కలర్ లో పౌడర్ బయటకు రావడాన్ని అతను గుర్తించి ఆశ్చర్యపోయాడు. దాన్ని బంగారంగా అనుమానించాడు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట ప్రభుత్వ అధికారులకు తెలిసిపోయింది. స్థానిక ఖప్రఖోల్ తహసీల్దార్ ఆదిత్య ప్రసాద్ మిశ్రా బోరును పరిశీలించిన అనంతరం సీజ్ చేశారు. బిడిఓ రష్మీ రంజన్ రౌత్, ఐఐసి రమాకాంత్ సాహు కూడా సంఘటన స్థలాన్ని సందర్శించి పౌడర్ ను పరిశీలించారు. అవి టార్చ్ లైట్ కింద మెరుస్తున్నాయని వారు చెప్పారు. మెరుస్తున్న పసుపురంగు కణికలు బంగారం అయి ఉండొచ్చని అనుమానిస్తూ నమూనాలను ప్రయోగశాలకు పంపారు. ల్యాబ్ పరీక్ష తర్వాత అది బంగారమా కాదా అని తెలుతుందని తహసీల్దార్ చెప్పారు. గంధమర్దన పర్వత ప్రాంతాలలో వివిధ లోహాల నిల్వలు ఉన్నాయని గతంలో నివేదికలు వచ్చాయి. గ్రామంలో బంగారం నిల్వలు ఉన్నాయో లేదో మాత్రమే గనుల శాఖ నిర్ధారించగలదని స్థానికులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) ఇటీవల జరిపిన సర్వేలు ఒడిశాలోని డియోగర్, కియోంజర్ మరియు మయూర్‌భంజ్‌తో సహా మూడు జిల్లాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)