రాష్ట్రపతి భవన్‌కు ప్రతిపక్ష ఎంపిల భారీ ప్రదర్శన

Telugu Lo Computer
0


''ప్రమాదంలో ప్రజాస్వామ్యం'' అంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపిలు రాష్ట్రపతి భవన్‌కు శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టాయి. భారీ భద్రతా బలగాల మధ్య విజయ్ చౌక్‌ నుండి రాష్ట్రపతి భవన్‌కు చేరుకునేందుకు ఎంపిలు యత్నించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంపిలను అదుపులోకి తీసుకుని బస్సుల్లో సమీప పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఎంపి సమావేశానికి ఇంకా షెడ్యూల్‌ ఖరారు కాలేదని అన్నారు. అదానీ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019నాటి పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి శిక్ష విధించడం కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణం నుండి దృష్టి మరల్చేందుకు రాహుల్‌కు శిక్ష విధించారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని డిమాండ్‌ చేస్తూ పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఏకకాలంలో నిరసనలు చేపట్టాయి. కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌తో సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)