కర్నాటకలో బీజేపీ వివాదాస్పద నిర్ణయం

Telugu Lo Computer
0


కర్నాటకలో ఓబీసీ కోటాలో 2బీ కింద ముస్లింలకు గతంలో కేటాయించిన 4% రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. వీటిని రెండు ఆధిపత్య వర్గాలైన వీరశైవ-లింగాయత్‌లు, వొక్కలిగలకు కేటాయించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ప్రవేశాలలో వీరిద్దరికీ రెండుశాతం రిజర్వేషన్లు పెంచింది. కర్నాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల్లో కొత్తగా రూపొందించిన 2సీ, 2డీ కేటగిరీల కింద వొక్కలిగల కోటా 4 శాతం నుంచి 6 శాతానికి, వీరశైవ-లింగాయత్‌ల కోటా 5శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద అమలు చేస్తున్న 10% కోటాలో పోటీ పడాల్సి ఉంటుందని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1995లో ఓబీసీ కోటాలో కేటగిరీ 2బీ కింద ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. గత డిసెంబర్‌లో బెలగావిలో జరిగిన శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా వొక్కలిగలు, వీరశైవ-లింగాయత్‌ల కోసం 2సి, 2డీ కొత్త కేటగిరీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ఆధారంగా ఇప్పుడు కేబినెట్ ఈ రిజర్వేషన్ల మార్పుల నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. లింగాయత్, వొక్కలిగల్ని ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)